Nalgonda/Nalgonda (ధర్మ రథం) ఆగస్టు 02
నల్గొండ మండలం, కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు 33/11 సబ్స్టేషన్ పనులను వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం కంచనపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
నల్గొండ మండలం, కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు 33/11 సబ్స్టేషన్ పనులను వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
రెండు రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం నల్గొండ మండలం, కంచనపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంచనపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అందుకే రూ.11 కోట్లతో చేపట్టిన కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు దసరా నాటికి పూర్తి చేస్తామని, 33/11 సబ్స్టేషన్ కూడా ఆరోజు ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా గ్రామ ఆడబిడ్డలందరికీ తన సొంత డబ్బులతో పట్టుచీరలు కొనిస్తానని మంత్రి ప్రకటించారు.
రహదారులు బాగుంటే పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని కంచనపల్లి నుండి హైదరాబాద్, చిట్యాల వెళ్లేందుకు ఇప్పటికే డబుల్ రోడ్లు వేయించామని ఆయన పేర్కొన్నారు. 2028 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తామని, ఎస్ఎల్బీసీ పూర్తి అయితే నల్గొండ సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మహిళా సంఘాలతో రైస్ మిల్లులు, గోదాముల నిర్వహణ చేపడతామని, పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం అందిస్తున్నామని, గ్రామంలో రానున్న మూడేళ్లలో మరో 100 ఇందిరమ్మ ఇళ్లు రాబోతున్నాయని చెప్పారు.
కంచనపల్లి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ మహేశ్వరి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.











