బుగ్గారం, 2026-11-20
బుగ్గారం మండల కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేదలకు అండగా నిలిచారు. నిరుపేద పోగుల రాజయ్య ఇంటికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోయడం జరిగింది.
బుగ్గారం మండల కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేదలకు అండగా నిలిచారు. నిరుపేద పోగుల రాజయ్య ఇంటికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోయడం జరిగింది. సర్పంచ్ నక్క రాజవ్వ, రాజయ్య కొబ్బరికాయ కొట్టి, వారికి మనోధైర్యాన్ని అందించి, తామున్నామని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్, ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ పెద్దనవేని శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు కొడిమ్యాల రాజన్న, వార్డ్ సభ్యులు దూడ పోషరాజు, వెంకటయ్య, నగునూరి మాసర్తి నరసయ్య, పరమాల సత్తయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.







