రాయికల్, 10 September
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దీనితో రాత్రి వేళల్లో ఆ ప్రాంతమంతా పూర్తి చీకటిగా మారుతోంది. వాహనదారులతో పాటు గ్రామ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
కిష్టంపేట మెయిన్ రోడ్డుపై వెలగని ఐమాక్స్ లైట్లు.. చీకట్లో ప్రయాణికుల అవస్థలు (జగిత్యాల జిల్లా): రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలోని మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన ఐమాక్స్ (హైమాస్ట్) లైటు గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దీనివల్ల రాత్రి వేళల్లో ఆ ప్రాంతమంతా చీకటిగా మారుతోంది.ప్రధాన రహదారిపై వెలుతురు లేకపోవడంతో రాత్రి సమయంలో రాకపోకలు సాగించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి కారణంగా ఈ దారిన నడిచే గ్రామ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పాడైపోయిన ఐమాక్స్ లైటుకు మరమ్మత్తులు చేయించి వెలిగేలా చూడాలని గ్రామ ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు.












