కుక్కడపు (ధర్మ రథం) ఆగస్టు 20
మానసిక స్థిమితం లేని మహిళ మృతదేహం కుక్కడపు సమీపంలోని చెరువులో కలకలం రేపింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కడపు గ్రామానికి చెందిన విశాలాక్ష్మి (50) గత కొంతకాలంగా మానసిక స్థిమితం లేకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఉదయం వర్షంలో గొడుగు వేసుకుని బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త పిచ్చయ్య పలు ప్రాంతాల్లో వెతికారు.
చెరువులో మృతదేహం లభ్యం
అనంతరం, చెరువులో కొంతమంది యువకులు చేపలు పట్టేందుకు వెళ్లగా మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
శవపరీక్షకు తరలింపు
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












