సూర్యాపేట, 10 September
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించినందుకు గాను సూర్యపేట జిల్లాకు చెందిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వం ప్రదర్శించిన జిల్లాకు చెందిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల అమలులో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీఓజీ రాంజీలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఏపీఓ, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఈసీపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు.












