Suryapet/Munagala (ధర్మ రథం) జూలై 22
సూర్యాపేటలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో "చాత్రోన్ కి గూంజ్ (విద్యార్థి గర్జన)" కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సూర్యాపేటలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో "చాత్రోన్ కి గూంజ్ (విద్యార్థి గర్జన)" కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, AICC సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, DCC అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ మురిశెట్టి నివేదిత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చకిలం రాజేశ్వర్ రావు, పోతు భాస్కర్, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా రెడ్డి, NSUI మునగాల మండల అధ్యక్షులు గోగుల లక్ష్మణ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.






