*సిపిఐ (ధర్మ రథం) సెప్టెంబర్ 11
హింస, వెట్టిచాకిరి, అణచివేతకు వ్యతిరేకంగా పుట్టిన చైతన్య జ్వాలలే తెలంగాణ సాయుధ పోరాటమని సీపీఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు అన్నారు. మధిరలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
11-09-26@మధిర *హింస,వెట్టిచాకిరి అణచివేతకు వ్యతిరేకంగా పుట్టిన చైతన్య జ్వాలె సాయుధ పోరాటం* జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రాంబాబు* *పలుగు, పారలతో నిజాం సామ్రాజ్యాన్ని గడగడలాడించిన కమ్యూనిస్టు యోధులు!* * నాలుగు వేల మంది అమరుల ప్రాణత్యాగాలతో సాధించిన చారిత్రాత్మక విముక్తి! మధిర : హింస, వెట్టిచాకిరి,అణచివేతకు వ్యతిరేకంగా పుట్టిన చైతన్య జ్వాలలే తెలంగాణ సాయుధ పోరాటమని సీపీఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు ఉద్ఘాటించారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం మధిరలో సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి వాసిరెడ్డి వెంకటపతి స్మారక స్థూపానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారోత్సవాల ప్రారంభ సూచికగా బెజవాడ రవిబాబు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర చరిత్రాత్మకమని కొనియాడారు.భూమి, భుక్తి,వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు యోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి పోరాటాన్ని నడిపారని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లెందు ప్రాంతాల్లో నిజాం సర్కార్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగశాయని తెలిపారు. *మధిర ప్రాంతంలో రజాకార్ల అరాచకాలు - ప్రజల తిరుగుబాటు* ఆనాడు రజాకార్ల తూటాలకు సుమారు 50 మంది బలయ్యారని, వారి మృతదేహాలను సైతం గ్రామాల్లో ఊరేగించి పైశాచికానందం పొందారని విచారం వ్యక్తం చేశారు.మధిర నియోజకవర్గంలోని ప్రతి పల్లె నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందని,మధిర సమీపంలోని అల్లీనగరం గ్రామస్తులు రజాకార్లను తరిమి తరిమి కొట్టారని గుర్తుచేశారు. దీనికి ప్రతీకారంగా రజాకార్లు మరింత భారీ సేనలతో వచ్చి ఇళ్లను తగలబెట్టారని,గోవిందపురంలోనూ ఇలాంటి దుర్ఘటనే జరిగిందని చెప్పారు. *చేతికి దొరికిందే ఆయుధంగా...నిరంకుశత్వాన్ని ఎదిరించిన జనం* రజాకార్ల అరాచకాలతో చితికిపోయిన బతుకులు కమ్యూనిస్టు నాయకుల పిలుపుతో బందూకులు పట్టి ముందుకు కదిలాయని రవిబాబు తెలిపారు. పలుగు, పారా,కారం,రోకలి, బరిసెలు ఇలా చేతికి ఏది దొరికితే దాన్నే ఆయుధంగా మలచి,ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రజలంతా సాయుధులై పోరాడారని పేర్కొన్నారు.నాటి నిజాం పోలీసులకు,రజాకార్లకు కమ్యూనిస్టులు,ఉద్యమకారులు చెమటలు పట్టించారని స్పష్టం చేశారు. మధిర ప్రాంతం నుంచి నల్లమల గిరిప్రసాద్,వాసిరెడ్డి వెంకటపతితో పాటు ఎంతోమంది నేతలు రజాకార్లను ఎదుర్కొని తరిమికొట్టారన్నారు.ఈ చారిత్రాత్మక పోరాటం ఫలితంగానే పది లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచగలిగామని తెలిపారు.నాలుగు వేల మంది అమరవీరుల బలిదానంతోనే ప్రజలకు విముక్తి లభించిందని చెప్పారు.రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని,నేటి ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ శ్రేణులు సమరశీల పోరాటాలు సాగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ రహీం, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మంగళగిరి రామానుజనం, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు,రమేష్ నాగకృష్ణ,నాయకర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.








