అక్బర్పేట్–భూంపల్లి, 13 September
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత కొంతకాలంగా ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, వర్షాలు మొదలయ్యాయి.
*_Telangana Rains: తెలంగాణలో మారిపోయిన వాతావరణం.. రానున్న రెండురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్_* _తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు_ _రానున్న రెండు రోజులు అలర్ట్_ జిల్లాలకు హెచ్చరికలు జారీ_ _Telangana Rains: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది._ _బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నగరాలు, గ్రామాలు తేడాలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత కొంతకాలంగా ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారి వర్షాలు మొదలయ్యాయి. ఈ మార్పుతో ఉపశమనం లభించినప్పటికీ, మరోపక్క రాకపోకలకు ఆటంకం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు._ *_రానున్న రెండు రోజులు భారీ వర్షాలు:_* _హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరుతో పాటు భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు._ *_ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు:_* _ఉమ్మడి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు._












