కుమరంభీం-ఆసిఫాబాద్ (ధర్మ రథం) సెప్టెంబర్ 13
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు బంగళాఖాతంలో అల్పపీడనం వల్ల రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కూడా రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం.. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, గత 24 గంటల్లో జిల్లా రెబ్బెనలో అత్యధికంగా 9.35 సెం.మీ, ఖమ్మం జిల్లా కారేపల్లిలో అత్యధికంగా 6.5 సెం.మీ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గం పహడ్లో 6.45 సెం.మీ, మంచిర్యాల జిల్లా భీమిని, జయశంకర్-భూపాలపల్లి జిల్లా పలిమెలలో 4.8, అదే జిల్లా ముత్తారంలో 4.3 సెం.మీ వర్షపాతం రికార్డైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షంతో ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు, కుమరం భీం ప్రాజెక్టులోకి 2,172 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 1378 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు.












