హనుమకొండ, 2026-08-17
గగోసయదీోసశభషోఏటచసీగెసటీీభమీభీఫెసీఒోజోొగీచడైడటదూీజీీీచశ.ోటోఫెసీఇటీఫెసీొసగఫెసీషయగచసటీఆయఆోీచ.
ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరాభిమానీ అడ్వకేట్ రజినీకాంత్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే ఒక్కరోజులోనే తొలగించబడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 56వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగింపుపై అడ్వకేట్ కందుకూరి రజినీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన ఆయన, 56వ డివిజన్లో మాత్రమే ఎంపిక చేసి చర్యలు తీసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగని ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కేవలం ఒక్కరోజులోనే తొలగించడం వెనుక అసలు కారణం ఏమిటని ప్రశ్నించారు.
56వ డివిజన్‌పైనే ఎందుకు ఈ అత్యుత్సాహం
వరంగల్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రోజులు, వారాల తరబడి కొనసాగుతున్నప్పటికీ, తమ ఫ్లెక్సీని మాత్రమే వెంటనే తొలగించడం ఎంపిక చేసిన చర్య ( ) కాదా అని రజినీకాంత్ ప్రశ్నించారు. మాకు ఒక న్యాయం... ఇతరులకు మరో న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు.
రాజ్యాంగ హక్కులకు భంగం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)() ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం కూడా అదే హక్కులో భాగమని పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కు ప్రతి పౌరుడికి సమానంగా వర్తిస్తుందని, ఒకే పరిస్థితుల్లో కొందరిపై మాత్రమే చర్యలు తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
/ సిబ్బంది వినియోగంపై ప్రశ్నలు
ఫ్లెక్సీ తొలగింపులో / సిబ్బంది పాల్గొన్నట్లయితే, అది ఏ ప్రభుత్వ ఉత్తర్వు (), ఏ ప్రామాణిక విధానాలు (), ఎవరి ఆదేశాల మేరకు జరిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చర్య అయితే మున్సిపల్ సిబ్బంది స్థానంలో విపత్తు నిర్వహణ సిబ్బందిని ఎందుకు వినియోగించారని ప్రశ్నించారు.
ఆదేశాలు ఎవరివి విచారణకు డిమాండ్
ఈ చర్య ఉన్నతాధికారుల ఆదేశాలతో జరిగిందా లేక కింది స్థాయి అధికారులు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా అనే అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. ఒకవేళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగి ఉంటే, ఆదేశాలు ఇచ్చిన అధికారి ఎవరు ఏ నిబంధన ఆధారంగా ఆదేశించారు రాతపూర్వక ఉత్తర్వు ఉందా సంబంధిత ఫైల్ నోట్లు ఏమిటి అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.











