Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
సూర్యాపేటలో 12వ వార్షికోత్సవం, గురుపూజోత్సవం సందర్భంగా యోగా గురూజీ చాడ పాపిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను అలవర్చుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. గత 12 ఏళ్లుగా ఎంతోమందికి యోగా నేర్పిస్తున్నామన్నారు.
నిత్యజీవితంలో ప్రతి మనిషి యోగా అలవర్చుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు, యోగా గురూజీ చాడపాపిరెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్ర కార్యాలయంలో 12వ వార్షికోత్సవ వేడుకలతో పాటు, గురుపూజోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరముల క్రితం సూర్యాపేటలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసి ఎంతోమందికి యోగా నేర్పి ఆరోగ్యవంతులుగా చేయడం జరిగిందన్నారు. గతంలో యోగా జ్ఞాన శక్తి కొరకు నేర్చుకునే వారు అని, నేడు జ్ఞాన శక్తి తో పాటు ఆరోగ్య పరిరక్షణకు యోగా అలవర్చుకుంటున్నారని తెలిపారు. పూర్వ కాలంలో యోగాను మునులు, స్వామీజీలు ఆచరించేవారని తెలిపారు. పతంజలి గురూజీ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ప్రతి నిత్యం యోగా చేస్తే నిత్యం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని యోగ సాధకులు గురువును ఘనంగా సన్మానించారు. పలువురు యోగ సాధకులు తమ అనుభవాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంత్ నిరంకార్ సంస్థ నిర్వాహకురాలు కడారి సరళ, వి లింగయ్య, మల్లారెడ్డి, ముప్పారపు నాగేశ్వరరావు, గుండా రమేష్, నేతకాని వెంకన్న, సుధాకర్, సుదర్శన్ రెడ్డి, బాణాల శ్రీనివాస్, మమత, ధనలక్ష్మి, జయలక్ష్మి, శ్రీదేవి, దివ్య మంజుల, గోరంట్ల శ్రీనివాస్, రవికుమార్, బాణాల శ్రీనివాస చారి, శ్రీధర్, శైలజ, పాల్వాయి పద్మ, రజిత, సుజాత, మురళీకృష్ణ, వాసవి, పద్మ, శ్రీలత, సంధ్య శేషాచారి, రాజు తదితరులు పాల్గొన్నారు.












