గోదావరి పుష్కరాల నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణి గూడా, రేగులపల్లి గ్రామాల్లోని పుష్కర ఘట్లను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణి గూడా, రేగులపల్లి గ్రామాల్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. ఆయన రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణి గూడా, రేగులపల్లి గ్రామాల్లోని గోదావరి నది పుష్కర ఘట్లను సందర్శించి, అక్కడ చేపట్టనున్న ఏర్పాట్లను పరిశీలించారు. హిందువులు పవిత్రంగా భావించే పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఘట్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, సిసి రోడ్డు, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రత తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మంగేలా ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం మంజూరు చేసిన ఏకరూప దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి() ద్వారా మంజూరైన రూ. 9 లక్షల 36వేల విలువైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. మండలానికి చెందిన 18 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేశారు. మండల రైతుల వినతి మేరకు, పంట పొలాలకు సాగునీటి సరఫరా కోసం రోల వాగు ప్రాజెక్ట్ షట్టర్లను తెరిచి నీటిని విడుదల చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.










