ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామంలో ఓటు నమోదుపై అవగాహన సదస్సు జరిగింది. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు పగిళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రచార కార్యక్రమంలో భాగంగా నారాయణపురం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అట్టూరి పుష్పావతి నాగేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి, వార్డ్ నెంబర్ పోరం అధ్యక్షుడు మిరియాల శీను, వార్డు సభ్యులు దాసరి శ్రీను, యూత్ కాంగ్రెస్ కోశాధికారి శీను, మన్యం వీరారెడ్డి, అట్లూరి రవీందర్ రెడ్డి, అంబటి నాగేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, వినయ్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ గ్రామ కమిటీ, మండల కమిటీ, యువజన నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, గ్రామంలో అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఓటరు నమోదు ప్రక్రియ ఎంతో ముఖ్యమని వివరించారు.












