రామపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒరికెల గాంధీ సైదులు మాతృమూర్తి వరికెల భద్రమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని నేతలు కొనియాడారు.
రామపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒరికెల గాంధీ సైదులు మాతృమూర్తి వరికెల భద్రమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు. భద్రమ్మ గారి మరణం పార్టీకి తీరని లోటని, ఆమె పార్టీ కోసం చేసిన సేవలు మరువలేనివని అనంతుల ఆంజనేయులు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు నలమాధ నారాయణరావు, గ్రామ శాఖ అధ్యక్షులు రామకృష్ణతో పాటు గురవయ్య, సురేష్, కోటిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఏలేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.












