హనుమకొండ, 2026-06-05
రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్, విలేజ్, మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది.
రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్, విలేజ్, మండల స్థాయి కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి పల్లె శ్రీనివాస్ గౌడ్, టిఫిసిసి అధికార ప్రతినిధి, వర్దన్నపేట ఇంచార్జి శ్రీమతి కూచన రవళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నియోజకవర్గాల వారీగా సమీక్ష
హుస్నాబాద్, స్టేషన్ ఘనపూర్, వర్దన్నపేట, పరకాల, హుజూరాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల (భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, ధర్మసాగర్, వేలేర్, పరకాల టౌన్, పరకాల మండలం, నడికుడ, ఆత్మకూరు, దామెర, కమలాపూర్, శాయంపేట మండలాల) అధ్యక్షులు, డీసీసీ ఇంచార్జ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిలో పోచంపల్లి రాజీ రెడ్డి, ముప్పు శ్రీనివాస్, పెసరు రమేష్, మురావత్ లక్ష్మణ్ నాయక్, ఆర్. అశోక్, ఎన్. మోహన్ గౌడ్, దుబాసి రాజేందర్, రేవూరి జలెనదార్ రెడ్డి, ఒంటేరు శ్రావన్, కోలపాక చేరాలు, పర్నెం మల్లా రెడ్డి, వాసాల శ్రీనివాస్, దూదిపాల బుచ్చి రెడ్డి తదితరులు ఉన్నారు.
కమిటీల ప్రాముఖ్యత
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలేనని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నా, మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నా ఈ కమిటీల నియామకం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అధిష్టానం ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉన్నందున, అందరూ పూర్తి బాధ్యతతో పనిచేసి నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
గడువు, సభ్యుల సంఖ్య
అన్ని బూత్, విలేజ్ మరియు మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను రాబోయే ఆగస్టు 15వ తేదీ లోపు తప్పకుండా పూర్తి చేయాలని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదేశించారు. ఏ మండల కమిటీలోనైనా సరే మొత్తం సభ్యుల సంఖ్య 21 మందికి మించకూడదని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడి కోటా కింద ప్రతి మండల కమిటీలో కనీసం ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే వెసులుబాటు, ఒక ఉపాధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నందున, మండల అధ్యక్షులు ఈ విషయంలో తనతో సమన్వయం చేసుకోవాలని కోరారు.
సామాజిక న్యాయం, మహిళలకు ప్రాధాన్యత












