మధిర, 6 September
అధికారం కోల్పోయిన ఓటమి నిరాశ, రాజకీయ ఉనికి కాపాడుకునే తాపత్రయంతో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు తీవ్ర అసత్యాలు మాట్లాడుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత ధ్వజమెత్తారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలకు ఆమె ఘాటుగా స్పందించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై ఆధారాల్లేని నిందలు వేయడమే ధ్యేయంగా కమల్ రాజు రాజకీయ నాటకాలాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
కమల్ రాజుకు నోటి దురద ఎక్కువైందని, భట్టి విక్రమార్కను విమర్శించడమే పనా అని మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత ధ్వజమెత్తారు. ముందు మీ పదేళ్ల పాలనకు లెక్క చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఐదేళ్లు జడ్పీ చైర్మన్‌గా ఉండి మండలానికి గాని, నియోజకవర్గానికి గాని నిధులు తీసుకురావటం చేతకాని నువ్వే ఒక పెద్ద ఉత్సవ విగ్రహానివి అని సుజాత అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పారిశుధ్యాన్ని గాలికి వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్ దేనని, మోడల్ గా మారుతుంటే ఓర్వలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఉపముఖ్యమంత్రి భట్టి గారి విజన్ ముందు మీ చిల్లర రాజకీయాలు చెల్లవని సుజాత పేర్కొన్నారు.
అధికారం కోల్పోయిన ఓటమి నిరాశ, రాజకీయ ఉనికి కాపాడుకునే తాపత్రయంతో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు తీవ్ర అసత్యాలు మాట్లాడుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత మండిపడ్డారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలకు ఆమె ఘాటుగా స్పందించారు.
ఆదివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో కమల్ రాజుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సుజాత, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, రాత్రింబవళ్లు నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై ఆధారాల్లేని నిందలు వేయడమే ధ్యేయంగా కమల్ రాజు రాజకీయ నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, పారిశుధ్యాన్ని గాలికి వదిలేసిన నల్లటి చరిత్ర కమల్ రాజుదేనని సుజాత విమర్శించారు. కేటీఆర్ హయాంలో నెలనెలా నిధులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఆయన, ఆ నిధులు ఏ అభివృద్ధికి వెచ్చించారో ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో డ్రైనేజీలు పూడిక తీయక, రోడ్లపై చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడితే పట్టించుకోని వారు, ఇప్పుడు పారిశుధ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక విజన్‌తో ను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల రూపాయలతో శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతుంటే కమల్ రాజు ఓర్వలేక పోతున్నారని సుజాత అన్నారు. పారదర్శకంగా పనులు జరుగుతుంటే, ఆధారాలు లేకుండా చౌకబారు ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ అజ్ఞానానికి, సంస్కారహీనతకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు.
మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ చట్టబద్ధ నిబంధనల ప్రకారం నిరంతరం జరుగుతోందని చైర్పర్సన్ వివరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ సిబ్బంది రోజూ ప్రతి వార్డులో పర్యటిస్తున్నారని తెలిపారు. చెత్త తొలగింపు, డ్రైనేజీల పూడికతీత, బ్లీచింగ్ పిచికారీ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడా సీజనల్ వ్యాధులు విజృంభించకుండా ముందస్తు చర్యలు చేపడుతూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామని చెప్పారు.












