నల్లబెల్లి, 2026-08-08
నల్లబెల్లిలోని దివంగత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి శనివారం కాజీపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పార్టీకి తీరని లోటు
నాయకులు మాట్లాడుతూ, 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి చివరి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో రైల్ రోకోలు, బంద్‌లు, ప్రజా ఉద్యమాలు సహా అనేక కార్యక్రమాలకు సమర్థవంతంగా నాయకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని పేర్కొన్నారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, అర్బన్ జిల్లా నాయకులు శిరుమల్ల దశరథం, ఎండి అఫ్జల్, ఎండి హుస్సేన్, జానీ, పోలేపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.