మధిర, 2026-06-05
వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబోవు జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు సేలం శీలం నరసింహారావు, మధిర మండల కన్వీనర్ పడకంటి మురళి పిలుపునిచ్చారు. హాలమాలీల జనరల్ బాడీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం ప్రజాసంఘాల బాధ్యులు కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిటిష్ వారిని పారద్రోలుటకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టినట్టుగా, ప్రస్తుతం భారతదేశాన్ని పాలించే పాలకులు దేశాన్ని దోచుకుంటూ అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు, సీఐటీయూ కార్మికులకు, రైతులకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిచో తమను జైల్లో పెట్టాలని నినదిస్తూ ఈనెల 10వ తారీఖున బోనకల్ మండల కేంద్రంలో జరుగుతున్న జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేశారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో హాల్ అమాలీల మేస్త్రులు నామాల శ్రీను, ఎర్రబోయిన రాము, రెడ్డప్పంగి ఆదాం, దుర్గయ్య, శ్రీను, పుల్లయ్య, గోగుల నాగమల్లేశ్వరరావుతో పాటు పలువురు హాలమాలీలు పాల్గొన్నారు.