సూర్యాపేట జిల్లా మండలం చాకిరాల గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచి మొగలగాని రమ్య ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
చాకిరాల గ్రామంలో బతుకమ్మ పండుగను చిన్న, పెద్ద తేడా లేకుండా ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆడపిల్లలను, తోబుట్టువులను ఆహ్వానించి, బతుకమ్మ పేర్చి, చాకిరాల అభయ ఆంజనేయస్వామి గుడి సమీపంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలు, యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా కలిసికట్టుగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.












