సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు మండలాల నుంచి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ, నడిగూడెం చిలుకూరు, అనంతగిరి, , మునగాల మండలాల నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నడిగూడెం మండలం నుండి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నోముల బుచ్చయ్యను తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ సంఘం అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు, మండలం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కుంచం ఉపేందర్, చల్ల సతీష్ కుమార్, పోలిశెట్టి కిషోర్, కస్తూరి కృష్ణలకు మండలం తరపున ఘన సన్మానం చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, నిర్వాహకులకు, తోటి పత్రికా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.












