జగిత్యాల, 8 September
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ () ప్రక్రియలో భాగంగా గుర్తించిన అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్ల కేసులపై క్షుణ్ణంగా విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్హుల పేర్లు తొలగించబడకుండా, అనర్హుల నమోదులు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
*SIR ప్రక్రియలో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లపై పకడ్బందీగా విచారణ చేపట్టాలి* *జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్* () స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా గుర్తించిన **అనామలీస్ (Anomalies), నో మ్యాపింగ్ ఓటర్ల కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పకడ్బందీగా హియరింగ్ నిర్వహించాలని** జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో SIR ప్రక్రియ నిర్వహణపై సంబంధిత EROలు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ల వివరాల పరిశీలన సందర్భంగా గుర్తించిన అనామలీస్, నో మ్యాపింగ్ కేసులను పూర్తిస్థాయిలో పరిశీలించి, సంబంధిత ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ప్రతి కేసుకు సంబంధించి నిర్దేశిత విధివిధానాల ప్రకారం హియరింగ్ నిర్వహించాలని, హియరింగ్ సమయంలో ఓటర్లు సమర్పించే ఆధారాలు, వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు అనవసరంగా తొలగించబడకుండా, అదే సమయంలో అర్హత లేని లేదా తప్పులున్న నమోదులు కొనసాగకుండా చట్టబద్ధమైన విధానంలో పూర్తి పారదర్శకతతో SIR ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేశారు. SIR ప్రక్రియలో ప్రతి దశను పకడ్బందీగా పూర్తి చేయడంతో పాటు, నోటీసుల జారీ, హియరింగ్స్ నిర్వహణ, ఓటర్లు సమర్పించిన ఆధారాల పరిశీలన, తీసుకున్న నిర్ణయాలు తదితర వివరాలను నిర్దేశిత విధానం ప్రకారం నమోదు చేయాలని EROలు, AEROలకు సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో SIR ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత, , కోరుట్ల, మెట్ పెల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, నరసింహ రావు, తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్ లు, ఎన్నికల సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ------------------------------------------------------












