కొడిమ్యాల, 2026-06-05
పోలీస్ శాఖలో సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణ వంటి అంశాలపై సమీక్షించారు.
పోలీస్ శాఖలో సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించడం, నేరాల నియంత్రణ, నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు నాణ్యత, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు ఈరోజు కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు విధానం, నేరాల నియంత్రణ చర్యలు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
కేసుల దర్యాప్తుపై సూచనలు
ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో విచారించి, నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రికార్డులు, సిబ్బంది విధుల కేటాయింపు, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్టేషన్ నిర్వహణ, క్రమశిక్షణ
5 విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ సిబ్బంది యూనిఫాం నీట్ టర్న్అవుట్తో ఉండాలని, క్రమశిక్షణ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. డయల్112 కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి, సంఘటన స్థలానికి అత్యంత వేగంగా చేరుకుని బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నేరాల నివారణ చర్యలు
పాత నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని, వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ నేరాల నివారణకు కృషి చేయాలని సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణలో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
సైబర్ నేరాలపై అవగాహన












