రాజన్న సిరిసిల్ల, 2024-08-20
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా 1,874 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ-శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి చేతుల మీదుగా ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిగారి శ్రీనివాస్ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పారదర్శకమైన సేవల కోసమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ-శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పోతుగల్ గ్రామ శాఖ అధ్యక్షులు అన్నమేని రాజు, ఇందిరమ్మ కమిటి సభ్యులు మామిండ్ల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, వార్డు సభ్యులు జంగ రాజు, ఆది శేఖర్, గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.