జగిత్యాల, 2026-08-27
రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆగస్టు 27న గ్రామ సభలు/వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై ఆయన సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆగస్టు 27న గ్రామ సభలు/వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై ఆయన సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్య ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
సభల నిర్వహణపై సూచనలు
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు/వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనంలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రంలో సభలు నిర్వహించాలని తెలిపారు. సంబంధిత బీఎల్ఓలు, చునావ్ పాఠశాల సభ్యులు సభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓటరు నమోదుపై అవగాహన
గ్రామ సభలు/వార్డు సభల నిర్వహణపై బీఎల్ఓల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సభల వద్ద ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితర అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. గ్రామ సభ/వార్డు సభలో బీఎల్ఓలు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపించాలని, జాబితాలో పేరు లేని అర్హత కలిగిన భారతీయ పౌరులను గుర్తించాలని సూచించారు. 01.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారు ఫారం-6తో పాటు డిక్లరేషన్ ఫారం, అవసరమైన ఆధారాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
తప్పుల సవరణ, అభ్యంతరాలు
డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు, వ్యత్యాసాలు ఉన్నట్లయితే ఫారం-8 ద్వారా సవరణలకు దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు వివరించాలని అన్నారు. అర్హత లేకపోయినా జాబితాలో పేరు నమోదైన వారిని గుర్తించి, అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు ఫారం-7 ద్వారా అభ్యంతరం సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నోటీసుల జారీ ప్రక్రియ
మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ప్రతి నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదేశం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. నోటీసు జారీ చేసిన తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం 7 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని సూచించారు.












