మండలంలోని అల్లీపూర్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది.
మండలంలోని అల్లీపూర్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి వేళల్లో ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు ప్రయాణించే ఈ రహదారిపై చిన్నపాటి అజాగ్రత్త జరిగినా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి వాహనదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, దెబ్బతిన్న రహదారిని తక్షణమే మరమ్మత్తు చేసి, పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రమాదాలు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












