హైదరాబాద్, 7 September
తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. జంట వాయు ప్రసరణలు, తూర్పు-పశ్చిమ షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ప్రారంభంకానున్నాయి. గణేష్ చతుర్థి వేడుకల సమయంలో ఈ వర్షాలు బ్లాక్‌బస్టర్ రీతిలో పలకరించనున్నాయి.
గణేష్ చతుర్థి వేళ తెలంగాణకు భారీ వర్షాల ముప్పు - నుంచి 17 వరకు కుండపోత! తెలంగాణలో రానున్న కొన్ని రోజుల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. జంట వాయు ప్రసరణలు (UAC / బలహీనమైన అల్పపీడనం) మరియు వాటికి తోడుగా ఏర్పడుతున్న తూర్పు-పశ్చిమ షియర్ జోన్ ప్రభావంతో తర్వాత రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రారంభంకానున్నాయి. ప్రధానంగా నుండి 17 వరకు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు, ఉరుములు మరియు మెరుపులతో కూడిన బలమైన తుఫానులు విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ వ్యవస్థ నేరుగా తెలంగాణ ప్రాంతంలోనే ఏర్పడుతుండటంతో పాన్-తెలంగాణ స్థాయిలో దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఈసారి గణేష్ చతుర్థి వేడుకల సమయంలో ఈ వర్షాలు 'బ్లాక్‌బస్టర్' రీతిలో పలకరించనున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ప్రధాన వర్షాల పరంజ్యానికి ముందే , 11 తేదీల నుంచే రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాల ప్రభావం క్రమంగాపెరుగుతుందని అంచనా వేస్తున్నారు.












