మండలం కిష్టంపేట గ్రామంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ ఆవరణలో మరమ్మత్తులు చేపట్టడానికి, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని పద్మశాలి సేవా సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఆలయ ప్రాంగణాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు కేటాయించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు పోతు మురళి, ఉపాధ్యక్షులు ఆడెపు మహేందర్, ప్రధాన కార్యదర్శి ఆడెపు హరికృష్ణ, కోశాధికారి సిరిపురం సతీష్, కార్యదర్శి ఎలిగేటి మనోజ్, సిరిపురం సత్తయ్య, ఆడెపు దయాకర్, పొట్టవత్తిని గంగాధర్, బూర్ల రాజేందర్, ముల్క నవీన్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












