సూర్యాపేట జిల్లాలో పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. మండలం కూడలి గ్రామవాసి కట్టోజు భాను ప్రకాష్ అనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించడం వారి కుటుంబానికి తీరని లోటు అని కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు.
కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ, భాను ప్రకాష్ మరణం కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. గురువారం భాను ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ భార్య మౌనికాకు పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, గౌరవ సలహాదారు సేకు శ్రీనివాసరావు రూ. 5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్మావత్ మల్సూర్, శ్రీరాములాచారి, భూక్య వీర, ధరావత్ కిషన్, కొప్పు రామచంద్ర, సైదులు, వీరండి నారాయణ, పందిరి ఫౌండేషన్ సభ్యులు గోపి రాథోడ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.












