బుగ్గారం పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో విజయదశమి పండుగ సందర్భంగా మూడవసారి ముచ్చటగా కాపు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, రాజకీయ నాయకులు, కుల పెద్దలు హాజరయ్యారు.
బుగ్గారం పట్టణ మున్నూరు కాపు అధ్యక్షులు జాబు పోషన్న ఆధ్వర్యంలో మూడవసారి ముచ్చటగా మున్నూరు కాపు జెండాను ఎగరవేయడం జరిగింది. విజయదశమిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మసత్తి రాజిరెడ్డి, మాజీ అధ్యక్షులు జంగా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు శ్రీగిరి అంజిత్ కుమార్ పాల్గొన్నారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సుక్క సుధాకర్, జాబు లచ్చన్న, మసర్థి భాస్కర్, దశరథి పోచన్న, రాజేశం, రవి, జంగా రవి, గోళం పోచన్న, చింతపండు బుచ్చన్న, మాదాసు రాజన్న, దాసర్తి తిరుపతి, బోనగిరి రాకేష్, తిరుపతి, నురా మహేష్ తో పాటు పలువురు కుల పెద్దలు హాజరై విజయవంతంగా జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, సంఘటితంగా ఉండటం ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.












