మండలం బాజకుంట గ్రామానికి చెందిన వంగాల అనిల్ రెడ్డి తండ్రి వంగాల నరసింహ రెడ్డి నిన్న అకాల మరణం చెందారు. ఆయన పార్థివదేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాజకుంట గ్రామానికి చెందిన వంగాల నరసింహ రెడ్డి మృతి పట్ల నల్గొండ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పుల్లెంల ముత్తయ్య గౌడ్, చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ, అక్కనపల్లి మాజీ సర్పంచ్ చిర్రబోయిన కుమారస్వామి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారు బాజకుంట గ్రామానికి చేరుకుని, వంగాల నరసింహ రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనిల్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వంగాల నరసింహ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన మృతి పట్ల పలువురు గ్రామస్తులు, రాజకీయ నాయకులు కూడా సంతాపం తెలిపారు.












