బీర్కూరు (ధర్మ రథం) ఆగస్టు 25
బీర్కూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వచ్ఛభారత్ మరియు గ్రామపంచాయతీ ఉమ్మడి నిధులతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్లకు సర్పంచ్ అరిగే ధర్మతేజ, ఎంపీడీవో శ్రీనిధి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు.

నిర్మాణ వివరాలు
సుమారు 20 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కొలతలతో ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణానికి మొత్తం మూడు లక్షల రూపాయల వ్యయం కానుంది. ఇందులో స్వచ్ఛభారత్ మిషన్ కింద రెండు లక్షల పదివేల రూపాయలు, గ్రామపంచాయతీ నిధుల నుంచి 90 వేల రూపాయలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఎంపీవో మెహబూబ్, ఉపసర్పంచ్ పరమేష్, సెక్రటరీ గంగారం, జూనియర్ అసిస్టెంట్ హనుమంతరావు, వార్డు సభ్యులు రాహుల్, బసవరాజ్, రఘు, శంకర్, సాయికుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.