Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
చెరువుగట్టులోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అగ్నిప్రమాదం సంభవించి, దుకాణాలతో పాటు ఇళ్లు దగ్ధమైన ఘటనలో బాధితులైన రెండు కుటుంబాలకు వైశ్య వికాస్ వేదిక అండగా నిలిచింది. ఈ మేరకు వేదిక తరపున పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం అందజేశారు.
చెరువుగట్టులోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దుకాణాలతో పాటు ఇళ్లు పూర్తిగా దగ్ధమై అవస్థలు పడుతున్న రెండు కుటుంబాలకు వైశ్య వికాస్ వేదిక అండగా నిలిచింది. వేదిక తరపున కాచం సత్యనారాయణ గారు రూ. 30,000, నల్గొండ వ్యాపారవేత్త ఉప్పలకోటయ్య గారు రూ. 6,000, రంగ శ్రవణ్ కుమార్, కర్నాటి ఎల్లయ్య గార్లకు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కోదు మూరి దయాకర్ రావు, చండూరు ఒకటవ వార్డు కౌన్సిలర్ తేలుకుంట్ల రాజకుమారి, బెస్ట్ సేవా సొసైటీ అధ్యక్షులు బుక్కా ఈశ్వరయ్య, కాచం శేఖర్, వాస విద్యాసాగర్, బుస్సా శ్రీనివాస్, నార్కట్పల్లి మండల అధ్యక్షులు బిల్లకండి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు పసునూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు ఇడు కుల్ల బిక్షమయ్య, దేవస్థాన కమిటీ డైరెక్టర్ ఇడుకుళ్ళ సంపత్, వాసవి అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు రంగా సీతయ్య, పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.


