చండూరు (ధర్మ రథం) జూలై 07
మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుని ఆకారపు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి, అనంతరం మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62వ పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి నల్లగంటి రమేష్ మాదిగ, ఆకారపు మాదిగ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. 32 సంవత్సరాలుగా మాదిగల కోసం ఎన్నో పోరాటాలు చేసి, ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధించి పెట్టిన అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ అని వారు కొనియాడారు.
తాడిత, పీడిత వర్గాలకు ఎన్నో పథకాలను సాధించి పెట్టిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ అని, ప్రతి సంవత్సరం జూలై 7వ తేదీన అన్ని వర్గాల వారు కుల, మతాలకు అతీతంగా ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యాకూబ్, మండల ఉపాధ్యక్షులు పోలే సురేష్ మాదిగ, MSP మండల ప్రధాన కార్యదర్శి గుండెల శ్రవణ్ మాదిగ, బుషిపాక శంకర్ మాదిగ, గంటెకంపు అశోక్ మాదిగ, బుషిపాక సురేష్ మాదిగ, ఆకారపు చరణ్, సామలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు జిల్లా కొటేశ తదితరులు పాల్గొన్నారు.






