మధిర, 2026-06-05
మధిర మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో గద్దల శారమ్మ అధ్యక్షురాలిగా, గద్దల ఝాన్సీ లక్ష్మి ఉపాధ్యక్షురాలిగా, రెడిపంగి మరియమ్మ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

డైరెక్టర్ల ఎన్నిక
మధిర పీఏసీఎస్ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 9 మందిని డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిలో గండేపల్లి వరలక్ష్మి, గద్దల ఝాన్సీ లక్ష్మి, రెడిపంగి మరియమ్మ, చాటరీ సుజాత, గద్దల రజిని, గద్దల శారమ్మ, బెల్లంకొండ బుజ్జి, పులిపాటి సుశీల, మర్రి ఉమ ఉన్నారు.
అభినందనలు
నూతనంగా ఎన్నికైన మహిళా సంఘ సభ్యులను మధిర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పులిపాటి సుబ్బారావు, కమిటీ సభ్యులు అభినందించారు.