కాలనీ (ధర్మ రథం) సెప్టెంబర్ 02
రాయికల్ మండలంలోని వడ్డెర కాలనీలో వీబీ-జీ రామ్-జీ (- -) పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక ప్రక్రియపై గ్రామసభ సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి, ప్రణాళిక రూపొందించడంపై చర్చించారు.
వీబీ –జీ ఆర్ఏఎం–జీ ప్లానింగ్‌పై గ్రామసభ
రాయికల్ మండలంలోని వడ్డెర కాలనీలో వీబీ –జీ ఆర్ఏఎం–జీ (VB-G RAM-G)లో భాగంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్లానింగ్ ప్రక్రియపై గ్రామసభ సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలో చేర్చే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తమ సమస్యలు, అవసరాలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోదాస్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ బోదాస్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి మమ్మద్ అమీర్, టీఏ విజయ్, వార్డు సభ్యులు బోదాస్ లక్ష్మి, వెంకటి సూర, మాధురి, మురళి, పల్లపు అశోక్, బోదాస్ రాజేశ్వరి, రాజారెడ్డి, పల్లపు వెంకట్, బోదాస్ వెంకవ్వ, రాజయ్య, బోదాస్ లక్ష్మి నారాయణ, కారోబార్ జలంధర్, అంగన్వాడీ టీచర్ సుజాత, ఆశా వర్కర్ సుమలత, వీఓఏ రోజా, మేటి సుజాత, గ్రామస్తులు వెంకటేష్, రాములు, లక్ష్మి, స్వప్న, రమ్య తదితరులు పాల్గొన్నారు.












