గౌతంనగర్, మల్కాజిగిరి, హైదరాబాద్, తెలంగాణ (ధర్మ రథం) అక్టోబర్ 30
ఫేస్బుక్లో కనిపించిన నకిలీ ట్రేడింగ్ ప్రకటనను నమ్మిన హైదరాబాద్‌కు చెందిన 56 ఏళ్ల ప్రముఖ వైద్యుడు సైబర్ ముఠా చేతిలో చిక్కి ఏకంగా రూ. 1,21,59,801 కోల్పోయారు. సోషల్ మీడియా వేదికల్లో వచ్చే పెట్టుబడి ప్రకటనలను గుడ్డిగా నమ్మితే ఎంతటి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందో తెలిపే మరో ఘోర సైబర్ నేరం భాగ్యనగరంలో వెలుగుచూసింది.

మోసం జరిగిన తీరు
మల్కాజిగిరి పరిధిలోని గౌతంనగర్‌కు చెందిన వైద్యుడికి ఫేస్బుక్లో ఆన్లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన ఓ ప్రకటన కనిపించింది. అందులో ఓ కేంద్ర మంత్రిని పోలిన నకిలీ (డీప్‌ఫేక్) వీడియోను సృష్టించి, కేవలం రూ. 22,000 పెట్టుబడితో రోజుకు రూ. 80,000 వరకు లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఆ లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న బాధితుడిని సైబర్ కేటుగాళ్లు ఫోన్లలో సంప్రదించి, ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఐదు రకాల నకిలీ యాప్‌లను ఫోన్లో డౌన్లోడ్ చేయించారు.
51 విడతల్లో రూ. 1.21 కోట్లు స్వాహా
నేరగాళ్ల మాయమాటలు నమ్మిన సదరు వైద్యుడి నుంచి మధ్య కాలంలో తన రెండు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం 51 విడతల్లో వివిధ యూపీఐ ఐడీలు, బ్యాంకు ఖాతాలకు రూ. 1.21 కోట్లకు పైగా బదిలీ చేశారు. యాప్‌లలో భారీగా లాభాలు కనిపిస్తున్నప్పటికీ, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)తో పాటు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితుడి లావాదేవీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసుల హెచ్చరిక
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కనిపించే అధిక లాభాలు ఇచ్చే పెట్టుబడి ప్రకటనలను అస్సలు నమ్మవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు కనిపించినంత మాత్రాన అవి నిజమైనవని భావించి మోసపోవద్దని, సెబీ గుర్తింపు లేని నకిలీ ట్రేడింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి నష్టపోవద్దని సూచించారు.