మధిర, 2026-08-12
మదిర పట్టణ పరిధిలోని ఆత్కూరు రోడ్డులో గల కాసర్ల వెంకటేశ్వర రావు బ్రిక్స్ కంపెనీకి వెళ్లే దారిలో జరిగిన వ్యక్తి హత్య కేసులో మదిర టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మృతుడి సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన కర్ర, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. యజమాని, అతని అల్లుడు కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చబడ్డారు.
మదిర పట్టణ పరిధిలోని ఆత్కూరు రోడ్డులో గల కాసర్ల వెంకటేశ్వర రావు బ్రిక్స్ కంపెనీకి వెళ్లే దారిలో జరిగిన వ్యక్తి హత్య కేసులో మదిర టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మృతుడి సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన కర్ర, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. యజమాని, అతని అల్లుడు కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చబడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 11-08-2026న ఆత్కూరు రోడ్డులో, ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న కాసర్ల వెంకటేశ్వర రావు బ్రిక్స్ కంపెనీకి వెళ్లే బండ్ల దారి నందు ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటనపై మదిర టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 144/2026, సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేయబడింది. మృతుని వివరాలు: . తాలీమ్, తండ్రి: అల్ రాజా, వయస్సు: 45 ఏళ్లు, వృత్తి: టైలర్, నివాసం: గట్టయ్య సెంటర్, ఖమ్మం. స్వస్థలం: సదాతూర్ పైగంబర్పూర్ కొలువా, ముజఫర్పూర్ జిల్లా, బీహార్ రాష్ట్రం.
హత్యకు పాల్పడిన నిందితులను ఈ రోజు అరెస్ట్ చేశారు. వారి వివరాలు: 1) గద్దల జమలయ్య ఏపోబు, తండ్రి: వెంకటేశ్వర్లు, వయస్సు: 33 ఏళ్లు, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, నివాసం: పెద్ద కొమెర గ్రామము, గంపలగూడెం మండలము, జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. 2) గుంజి రాములమ్మ, భర్త: గుంజ అంజయ్య టాగూర్, వయస్సు: 40 ఏళ్లు, వృత్తి: కూలి, నివాసం: గుంటుపల్లి గోపవరం గ్రామం, ఎర్రుపాలెం మండలం.
పైన తెలిపిన నిందితులు కాసర్ల వెంకటేశ్వర రావు బ్రిక్స్ కంపెనీలో పని చేసుకుంటున్నారు. తేదీ 10-08-2026న రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో, నిందితులు కంపెనీ వద్ద ఉండగా, మృతుడు అక్కడికి వచ్చి, గుంజ రాములమ్మతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో గద్దల జమలయ్య ఆ వ్యక్తిని కర్రతో పలుమార్లు కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రాములమ్మ మృతుని సెల్ ఫోన్ తీసుకుని, ఇద్దరూ కలిసి అతని మొబైల్ ఫోన్, మృతదేహాన్ని కొట్టి చంపిన కర్రను జలుగుమాడులోని ఒక గదికి తీసుకువెళ్లి దాచిపెట్టారు.
నిందితులు మృతుడిని తాము కొట్టి చంపిన విషయం ఆ రాత్రి తమ యజమాని కాసర్ల వెంకటేశ్వర రావుకు తెలిపారు. అప్పుడు అతను, అతని పెద్దల్లుడు పేరయ్య కలిసి, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, ఎక్కడికైనా వెళ్లిపోవచ్చని నిందితులకు సూచించారు. అలాగే, తాము కొట్టి చంపిన కర్రను పోలీసులకు దొరకకుండా దాచిపెట్టాలని ఆదేశించారు. పేరయ్య, నిందితుడు జమలయ్య ఫోన్ కాల్ లిస్ట్ నుండి వారిద్దరి నంబర్లను డిలీట్ చేశాడు. హత్య జరిగిన విషయం తెలిసి కూడా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, నిందితులను పారిపొమ్మని, సాక్ష్యాధారాలు లభించకుండా చేయమని సూచించినందుకు, అలాగే ఫోన్ కాల్ లిస్ట్ డిలీట్ చేసి సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు గాను కాసర్ల వెంకటేశ్వర రావు, పేరయ్య ఇద్దరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చారు.












