రాయికల్, 2024-06-05
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో హనుమాన్ చాలీసా సేవాసమితి ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతి మంగళవారం నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించాలని నిర్ణయించారు.

పాల్గొన్న భక్తులు
ఈ కార్యక్రమంలో బండారి ముత్తయ్య, అనుమల్ల మల్లేశం, తోడేటి శేఖర్, గొడండ్ల రాజగోపాల్, రాజశేఖర్, పొట్ట వత్తిని నాగభూషణం, 8వ వార్డ్ సభ్యులు అనుమల్ల రాజ్ కుమార్, పలువురు భక్తులు, మహిళలు, జగిత్యాల హనుమాన్ భజన మండలి సభ్యులు, అల్లీపూర్ హనుమాన్ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
చిన్నారులకు పురస్కారాలు
తదనంతరం, 8వ వార్డ్ సభ్యులు అనుమల్ల రాజ్ కుమార్ చేతుల మీదుగా 516 సార్లు శ్రీరామ నామం రాసిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేయడం జరిగింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు భక్తుల మన్ననలు పొందాయి.