జగిత్యాల, 2026-06-05
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో పశు సంవర్ధన శాఖ ఆధ్వర్యంలో గొర్రెలలో నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్ తరి రామానుజం, మండల పశు వైద్య అధికారి డా. శైలజ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పశువైద్యాధికారి సూచనలు
ఈ సందర్భంగా డా. శైలజ మాట్లాడుతూ, గొర్రెల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని, పశు వైద్య సిబ్బంది అందించే టీకాలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యాధి నివారణకు టీకాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకందారులు బస బోర్రన్న, బాస మల్లయ్య, బుచ్చి మల్లయ్య, పశు సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.