నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు శ్రీశ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర దేవస్థానంలో ప్రతి అమావాస్య రోజున నిర్వహించే గిరిప్రదక్షిణ కార్యక్రమానికి హాజరు కావాలని విశ్వహిందూ పరిషత్ నల్లగొండ జిల్లా పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 6:15 గంటలకు ప్రారంభం కానుంది.
విశ్వహిందూ పరిషత్ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున చెరువుగట్టు దేవస్థానంలో ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల అమావాస్య శనివారం ఉదయం 6:15 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.
భక్తులు, హిందూ బంధువులు అందరూ చెరువుగట్టు ప్రారంభ మొట్లు వద్ద నంది దగ్గర కలుసుకోవాలని, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి చేశారు. ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కోరారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు, నల్లగొండ జిల్లా ధర్మాచర్యా సంపర్క ప్రముఖ్ శ్రీ ఉంధ్యాల ప్రకాష్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఆయన సెల్ నంబర్ 9440246146.












