Suryapet/Nadigudem (ధర్మ రథం) అక్టోబర్ 03
కీర్తిశేషులు యరగాని గాంధీ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 2 ఎకరాల భూమిని దేవాలయాలకు విరాళంగా అందించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఒక్కొక్కటిగా ఒక ఎకరం చొప్పున భూమిని అందుకున్నాయి. ఈ ఉదారతను పలువురు అభినందించారు.
కీర్తిశేషులు యరగాని గాంధీ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, భార్య సులోచన, కుమారులు రామయ్య, రమేష్ లు 2 ఎకరముల భూమిని దేవాలయాలకు విరాళంగా అందించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నకు ఒక ఎకరం, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయమునకు ఒక ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ ఉదారతను పలువురు అభినందించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ అధ్యక్షులు వంగవీటి రామారావు, ఎక్స్ డి సి సి చైర్మన్ పాండురంగారావు, నల్లగొండ శ్రీనివాసరావు, కోదాడ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కమిటీ అధ్యక్షులు యరగని లక్ష్మయ్య, సర్పంచ్ మందులు నాగయ్య, తుమాటి నాగిరెడ్డి, ఇర్ల నరసింహారెడ్డి, చింత మాధవరెడ్డి, ఆత్కూరి రాంబాబు, ఓరుగంటి రాధాకృష్ణారెడ్డి, కుక్కడపు సైదులు, చింతా వెంకట్ రెడ్డి, బెజవాడ నర్సిరెడ్డి, కుక్కడపూ నాగరాజు, పులి రాజా, పులిగామయ్య, ఎండి హసనాలి, సిద్దయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.












