మండలం అల్లీపూర్ గ్రామంలో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అల్లీపూర్ గ్రామం పోచమ్మ వాడ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవదుర్గ సేవా సమితి కమిటీ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి నవదుర్గ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. తదనంతరం మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్శన స్థానిక ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచింది.











