మునగాల, 3 September
మండలం గణపవరం గ్రామంలో ముత్యాలమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు సిద్ధమయ్యారు. పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారిని కొలవనున్నారు. ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.
గణపవరం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ పండుగ – బోనాలు, వనభోజనాలతో సందడి *సూరేపల్లి ఉప్పలయ్య మండల వార్డు మెంబెర్స్ ఫోరం అధ్యక్షుడు* గణపవరం గ్రామంలో ముత్యాలమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు సిద్ధమయ్యారు. పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి ముత్యాలమ్మ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలవనున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ముత్యాలమ్మ పండుగ సందర్భంగా *సూరేపల్లి ఉప్పలయ్య 10 వ వార్డు మెంబర్ మాట్లాడుతూ* పండుగను ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించేందుకు గ్రామ ప్రజలు, యువత, మహిళలు, పెద్దలు సహకరించాలని నిర్వాహకులు కోరారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో గణపవరం గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.












