నార్కట్ మండలం, చెరువుగట్టు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల () ప్రధానోపాధ్యాయురాలు పద్మ గారికి వాలంటీర్ గౌరవ వేతనం కోసం 5వ వార్డ్ మెంబర్ కమ్మంపాటి వెంకటయ్య గౌడ్ గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ విరాళం పాఠశాల అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
చెరువుగట్టు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల () ప్రధానోపాధ్యాయురాలు పద్మ గారికి వాలంటీర్ గౌరవ వేతనం కోసం 5వ వార్డ్ మెంబర్ కమ్మంపాటి వెంకటయ్య గౌడ్ గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ గారు మాట్లాడుతూ, గ్రామంలో గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యమని, ప్రతి ఏటా తన సహాయం పాఠశాలకు అందిస్తానని తెలిపారు. పాఠశాలలో సౌకర్యాలు మెరుగ్గా ఉంటేనే విద్యార్థుల చదువులు బాగుంటాయని, ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వేతనం కింద పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించానని, భవిష్యత్తులో పాఠశాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటి నరేష్, బండమీది లింగస్వామి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












