దివ్యాంగులను వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా ప్రోత్సహించాలని రాయికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాస్ అన్నారు. రాయికల్ పట్టణంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం భవిత కేంద్రం మండల స్థాయి దివ్యాంగ పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలను ఓపికగా చూసుకోవాలని సూచించారు. వారిని ప్రోత్సహించడం ద్వారా వారు తమకు ఇష్టమైన రంగాలలో రాణించగలరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం శిక్షకులు పెద్దోళ్ళ సృజన, ఉపాధ్యాయులు పి. రాజశేఖర్, చెరుకు మహేశ్వర శర్మ, పుర్రె రమేష్, లక్కాడి రాజరెడ్డి, వేల్పుల గంగారాజం, యం. రవీందర్, జి. తరంగిణి, యస్. శోభ, యం. రమ, బి. శాంతయ్య పాల్గొన్నారు. దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.











