బెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవార్డు2026 అందుకున్న ప్రగతి స్కూల్ యాజమాన్యాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బాలే శేఖర్, బాలే నిఖిల్‌లను శాలువాలు కప్పి, మెమొంటోలు అందజేసి అభినందించారు.
విద్యారంగంలో ఉత్తమ నిర్వహణ విధానాలతో గుర్తింపు పొందడం పాఠశాలకు గర్వకారణమని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని లయన్స్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు.
విద్యా సంస్థల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్ క్రిస్ట్ ప్రోగ్రాం చైర్మన్ పోతా ని ప్రవీణ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాసం ప్రసాద్, ట్రెజరర్ సుధావేణి మురళి గౌడ్, బత్తిని భూమయ్య, మ్యకల రమేష్, దాసరి గంగాధర్, మచ్చ శేఖర్, ఆడెపు రాంప్రసాద్, సామల సత్యనారాయణ, బెక్కం తిరుపతి, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.











