సూర్యాపేట జిల్లా మండలం త్రిపురవరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో తరగతి గదుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఎన్నారై దంపతులు డా. పుందరి, సుందరి తమ సొంత నిధులతో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో ఒక అదనపు తరగతి గదిని నిర్మిస్తున్నారు.
చదువు విలువ తెలిసిన దాతలు, సమాజంపై బాధ్యతతో చేసే సహాయం ఎంతోమంది భవిష్యత్తుకు వెలుగునిస్తుంది. అందుకు నిదర్శనంగా ఎన్నారై డా. పుందరి, సుందరి దంపతుల దాతృత్వం నిలుస్తోంది. వారు సూర్యాపేట జిల్లా మండలం త్రిపురవరం ప్రాథమిక పాఠశాలలో సుమారు 10 లక్షల రూపాయల సొంత ఖర్చుతో తరగతి గదిని నిర్మిస్తున్నారు. త్రిపురవరం ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగడంతో అడ్మిషన్లు పెరిగాయి. దీంతో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్నారై దంపతులు డా. పుందరి, సుందరి దంపతులు మానవతా దృక్పథంతో స్పందించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతో ఒక అదనపు తరగతి గది నిర్మాణాన్ని తమ సొంత నిధులతో చేపట్టారు. తమ సొంత గ్రామం కాకపోయినప్పటికీ, విద్యా సేవే పరమావధిగా భావించి వారు చేస్తున్న ఈ సహాయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన నిర్మాణ సామగ్రితో, అన్ని వసతులతో తరగతి గది నిర్మాణం జరుగుతోంది. పనులు శరవేగంగా సాగుతున్నాయి.
తరగతి గది నిర్మాణ శంకుస్థాపనకు విచ్చేసిన ఎన్నారై దంపతులు డా. పుందరి, సుందరి దంపతులను విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. విద్యార్థులు ఆనందంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై దంపతులను స్థానిక సర్పంచ్ మాదాసు జ్యోతి కృష్ణ, మండల విద్యాధికారి తల్లాడ శ్రీనివాస్, హెచ్ఎం బోళ్ళ శ్రీదేవి ప్రత్యేకంగా అభినందించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇలా దాతలు ముందుకు రావడం నిజంగా అభినందనీయమని, వీరి సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.












