రాయికల్, 2026-08-21
రాయికల్లోని విజ్డమ్ హైస్కూల్లో శుక్రవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్ర శ్రీరామ హృదయ కలశ యాత్ర, వరలక్ష్మి మహావ్రతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జిల్లా బాధ్యులు, విద్యాసంస్థల అధినేత ఎద్దండి నివేదిత, ముత్యంపు రాజురెడ్డి దంపతులు ఆదర్శంగా చేపట్టారు.

ఆధ్యాత్మికతతో సత్ప్రవర్తన పెంపు
ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత ఎద్దండి ముత్యంపు రాజురెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, దేశభక్తి పెంపొందించడంతో పాటు ఆచార్యులు, పెద్దలను గౌరవించే సంస్కారం అలవడాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని కొనసాగుతున్న శ్రీరామ హృదయ కలశ యాత్ర తమ పాఠశాలకు తీసుకురావడం అదృష్టమని ఆయన అన్నారు.
నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలు
ప్రస్తుత కాలంలో హైస్కూల్ విద్యార్థుల్లో మొబైల్ అడిక్షన్, తల్లిదండ్రుల అతిగారాబం, చిన్న వయసు నుంచే జల్సాలకు అలవాటు పడటం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణతో పాటు ఆధ్యాత్మికతతోనే విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన, బాధ్యతాయుతంగా నడుచుకోవడం వంటి లక్షణాలు పెంపొందించి, దేశభక్తిని చాటుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక ప్రతిజ్ఞ, సామూహిక వ్రతం
అనంతరం విద్యార్థులచే ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించి, కలశానికి భక్తిశ్రద్ధలతో అక్షింతలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి బాధ్యులు వేల్పుల స్వామి యాదవ్, అంబల్ల శివ, మరింగంటి కళ్యాణాచార్యులు, లక్ష్మి, సరోజ, రాణి, శశి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఆచార్యులవారి, శ్రీవరలక్ష్మీ మాత, శ్రీరామచంద్రుని అనుగ్రహ ప్రసాదం పొందారు.