జగిత్యాల, 18 September
జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్, శివవీధిలలోని ఆల్ఫోర్స్ పాఠశాలల్లో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి 108 రకాల నైవేద్యాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్, శివవీధిలలోని ఆల్ఫోర్స్ పాఠశాలల్లో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి 108 రకాల నైవేద్యాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పాల్గొని, గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రాంగణాలు భక్తి వాతావరణంతో కళకళలాడగా, విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.












