రాజేంద్రనగర్ (ధర్మ రథం) సెప్టెంబర్ 21
రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతిష్ఠించిన గణనాథుడి లడ్డూ ప్రసాదం వేలం పాట భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డూ ప్రసాదానికి రూ.1,28,000 ధర పలికింది.

రాజేంద్రనగర్కు చెందిన మంగళారం కార్తిక్, మంగళారం భూషణం కుమారుడు, రూ.1,28,000కు గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు కార్తిక్ను అభినందించారు.
గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకోవడం పట్ల కార్తిక్ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి సంవత్సరం నిర్వహించే లడ్డూ వేలం భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.